

Tarun Bhaskar: దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాతో ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు ఈయన. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించారు. అలా కొన్ని సినిమాల్లోకి డైరెక్టర్ గా మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన ప్రస్తుతం ఓ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా ఈషా రెబ్బా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
Pellichoopulu director Tarun Bhaskar admits that his love for the heroine is real
అయితే ఈ సినిమా విషయం కాస్త పక్కన పెడితే తాజాగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఈషా రెబ్బా తో తరుణ్ భాస్కర్ ప్రేమలో పడ్డాడని వార్తలు గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ఓ పండగ సమయంలో కూడా ఈషా రెబ్బా తరుణ్ భాస్కర్ ఇంట్లో కనిపించేసరికి డౌట్ లేదు వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తోంది అనే రూమర్ టాలీవుడ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.దాంతో ఈషా రెబ్బాని తరుణ్ భాస్కర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.(Tarun Bhaskar)
Also Read: RGV: బాలకృష్ణ సినిమాలు చూడను.. ఆర్జీవిపై నందమూరి ఫ్యాన్స్ ఫైర్..!
అయితే తరుణ్ భాస్కర్ కి ఇప్పటికే లతతో పెళ్లయింది.ప్రస్తుతం లతకు విడాకులు ఇచ్చేశారు అని ఈషా రెబ్బాని రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు తరుణ్ భాస్కర్.. తాజాగా తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు తెలిసిన వారిలో అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే వారందరిలో ఎవరిది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని యాంకర్ ప్రశ్నించగా…

అందరిలో గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నాదే అంటూ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఆన్సర్ కి యాంకర్ కూడా మీరు లవ్ లో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలుసు అంటూ యాంకర్ నవ్వడంతో ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది. అయితే ఈషా రెబ్బాతో ప్రేమలో ఉన్న విషయం పబ్లిక్ గా చెప్పకుండా ఇలా పరోక్షంగా తరుణ్ భాస్కర్ హింట్ ఇచ్చారని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ ఒక్క మాటతో మరోసారి తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా లవ్ స్టోరీ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.(Tarun Bhaskar)







