Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న విజయ సాయిరెడ్డి.. జగన్ వ్యూహమేనా ?

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. అవసరమైతే రాజకీయ పార్టీ పెడతానంటూ తాజాగా విజయసాయిరెడ్డి సంచలనం ప్రకటన చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా వైసిపి పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. Vijayasai Reddy

Vijayasai Reddy plane to launch new political party

దీంతో జగన్మోహన్ రెడ్డి డీలా పడిపోయారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాల్సిన విజయసాయిరెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అనంతరం జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ వ్యాఖ్యానించారు. దానివల్ల తనకు అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు. అలాంటి విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. Vijayasai Reddy

Also Read: Rohit-Kohli: డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ..టికెట్ ధ‌ర ఎంతంటే ?

వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే కొత్త పార్టీ పెడతానంటూ వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు, కానీ అవసరమైతే రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. దీంతో 2029 లోపు కూటమి ఓట్లు చీల్చేలా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతాడని చర్చ జరుగుతోంది. ఇదంతా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకమేనా అని కొంతమంది చర్చించుకుంటున్నారు. మరి విజయ సాయి రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి అడవులు వేస్తారో చూడాలి. Vijayasai Reddy

Also Read: I-Bomma Ravi Father: కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు.. ఐ-బొమ్మ రవి తండ్రి…

Share your love