
Rohit-Kohli: రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. డిసెంబర్ ఆరవ తేదీన విశాఖపట్నం నగరానికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రాబోతున్నారు. దీంతో ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. Rohit-Kohli
Rohit, Kohli to Vizag on December 6
ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా విశాఖపట్నం రాబోతున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఈ మ్యాచ్ జరగనుండగా.. విశాఖపట్నంలో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ సందడి చేయనున్నారు. దీంతో ఈ ఇద్దరు ప్లేయర్లను ప్రత్యక్షంగా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే టికెట్లపై కూడా కీలక ప్రకటన చేసింది బీసీసీఐ. నవంబర్ 28వ తేదీ నుంచి ఈ టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులోకి వస్తాయి. Rohit-Kohli
ALSO READ: Vaibhav suryavanshi: సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదంటూ ట్రోలింగ్?
డిస్ట్రిక్ట్ యాప్ లో 22,000 టికెట్లు అందుబాటులో పూడనున్నాయి. ఈ టికెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. అంతేకాదు ఈ ఒక్క టికెట్ ధర 12 వందల రూపాయల నుంచి 18 వేల రూపాయల వరకు ఉంటుందట. అయినప్పటికీ డబ్బులు పెట్టేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మను చూసి తీరాలని అంటున్నారు ఏపీ ఫ్యాన్స్. ఇటు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వైజాగ్ వెళుతున్నారు. Rohit-Kohli
ALSO READ: KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్రబాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను…




















