
Kavitha: కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తలనొప్పిగా మారింది. తన కన్న కూతురే గులాబీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం కేసిఆర్ కు కొత్త టెన్షన్ తీసుకువస్తుంది. మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత సైలెంట్ గా, కెసిఆర్ రైట్ హ్యాండ్ గా ఉన్న నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆస్కాము ఈ స్కాము అంటూ ఆ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha
MLC Kavitha at Rahul Sipligunj Wedding
అయితే ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కట్టిన చీరలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొన్న ప్రగతి భవన్ లో తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు రంగుల జెండా కలర్ మ్యాచ్ అయ్యేలా చీర కట్టారు కల్వకుంట్ల కవిత. ఈ చీర అచ్చం కాంగ్రెస్ జెండా లాగానే కనిపించింది. ఇదే విషయాన్ని గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా ట్రోలింగ్ చేస్తోంది. Kavitha
Also Read: Team India: WTC ఫైనల్స్ కు టీమిండియా చేరే అవకాశం ఇంకా ఉందా..? ఎన్ని…
అటు తాజాగా టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా కల్వకుంట్ల కవిత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఎల్లో కలర్ చీరలో అమ్మేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కలవకుంట్ల కవిత చేరిపోయిందని ట్రోలింగ్ మొదలుపెట్టింది గులాబీ సోషల్ మీడియా. మొత్తానికి కాంగ్రెస్ అలాగే టిడిపి పార్టీని కలిపేందుకు కల్వకుంట్ల కవిత బాగా ప్రయత్నాలు చేస్తుందని దారుణంగా ఆడుకుంటున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేసి కవితను ట్రోల్ చేస్తున్నారు. Kavitha
Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి…





