Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్క‌లే ?

Kadiyam Srihari comments on ktr brs

Kadiyam Srihari: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కేసుల ద్వారా అతన్ని బొక్కలో వేయాలని ఎంత ప్రయత్నించినా అసలు కుదరడం లేదు. దీంతో మాటలతో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డిఫెన్స్ లో పడేసేందుకు కొత్త స్కెచ్ లు వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన
కడియం శ్రీహరితో సరికొత్త గేమ్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. Kadiyam Srihari

Kadiyam Srihari comments on ktr brs

తాజాగా కేటీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ లో నాయకత్వ లక్షణాలు లేవని నిప్పులు చెరిగారు. అతని వల్లే గులాబీ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వస్తున్నారని బాంబు పేల్చారు. కల్వకుంట్ల కవిత కూడా అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. అహంకారం అలాగే బలుపు మాటలతో నాయకులు ఎవరూ కాబోరని ఫైరయ్యారు. Kadiyam Srihari

Also Read: Team India: WTC ఫైనల్స్ కు టీమిండియా చేరే అవకాశం ఇంకా ఉందా..? ఎన్ని…

ఇప్పటికే కేటీఆర్ పై 10 కేసులు ఉన్నాయని, ఏ క్షణమైనా జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. కెసిఆర్ ఉన్నంతవరకు హరీష్ రావు ఆ పార్టీలో పని చేస్తారని గుర్తు చేశారు. కెసిఆర్ మరణించిన తర్వాత గులాబీ పార్టీ మూడు ముక్కలవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. 10 సంవత్సరాలలో 36 మందిని ఆ పార్టీలో చేర్చుకున్నారు అని, అప్పుడు కేటీఆర్ కు నీతులు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. దీంతో కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా మారినట్లు తెలుస్తోంది. Kadiyam Srihari

Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu