BRS Diksha Divas: దీక్షా దివస్ చరిత్ర ఇదే… ఆ ఒక్క రోజే కేసీఆర్ హీరో అయిపోయాడు

BRS Diksha Divas: తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాత్ర అంతా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే గులాబీ పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. ఢిల్లీ పాలకులతో పాటు సీమాంధ్ర ఆధిపత్యం పై పోరాటం చేసి , తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేశారు కేసీఆర్. కెసిఆర్ అనే వాడే లేకపోతే తెలంగాణ లేదు అన్న రేంజిలో పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో 80% కేసీఆర్ పాత్ర ఉంది. మిగతా 20 శాతం విద్యార్థులు, ప్రజా సంఘాలు ఉంటాయి. ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ సాధన. BRS Diksha Divas

BRS Diksha Divas KCR becomes real hero

అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత 2009 నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే కరీంనగర్ నుంచి నిరాహార దీక్ష శిబిరానికి బయలుదేరారు. ఆ సమయంలో సీమాంధ్ర పాలకులందరూ పెద్ద కుట్రే చేశారు. కరీంనగర్ లోని అలుగునూరు ప్రాంతంలో కేసీఆర్ను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. జైల్లో పెడితే ఈ బక్క పలుచని కేసీఆర్, సైలెంట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ జైల్లో కూడా అతను దీక్ష కొనసాగించారు. అలా దాదాపు తొమ్మిది రోజులపాటు దీక్ష చేసిన కేసీఆర్ ఆసుపత్రి పాలయ్యారు. BRS Diksha Divas

Also Read: Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్క‌లే ?

మరొక రోజు అలాగే దీక్ష చేస్తే కెసిఆర్ చావడం గ్యారంటీ. దీంతో ఢిల్లీ పాలకుల్లో వణుకు మొదలైంది. అప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లు, నిరసనలు, సీమాంధ్ర పాలకులపై వ్యతిరేక పోరాటం ఎగిసి పడింది. ఇది గమనించిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష వీరమన చేశారు. అయితే మళ్లీ సీమాంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు. అయినప్పటికీ చాలా స్ట్రాటజీగా ముందుకు వెళ్లి 2014 వరకు తెలంగాణ తీసుకువచ్చారు కేసీఆర్. ఇలా నవంబర్ 29, 2009 తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన రోజు. BRS Diksha Divas

Also Read: Kavitha: కాంగ్రెస్‌, టీడీపీ పార్టీని క‌లుపుతున్న క‌విత‌..రెండు చీర‌లు క‌ట్టుకుని ?

Share your love