
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తీన్మార్ మల్లన్న ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంది సాయి ఈశ్వర చారి. అయితే ఇవాళ ఈశ్వర చారి అంతక్రియల నేపథ్యంలో తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. Teenmar Mallanna
MLC Teenmar Mallanna under house arrest
తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారని పోలీసులను ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న నిలదీశారు. దీంతో పోలీసులకు, తీన్మార్ మల్లన్నకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఎప్పుడు హాట్ టాపిక్ అయింది. కాకా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగా ప్రయత్నాలు చేసి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చేతులు దులుపుకుంది. Teenmar Mallanna
Also Read: KCR: కేసీఆర్ చెంతకు వరంగల్ లీడర్లు..ఇక కారు జోరును ఆపలేరు ?
అటు స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా 42 శాతంతో మొదట ఎన్నికలకు వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో తోక ముడిచింది. ఇలాంటి నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తీన్మార్ మల్లన్న అలాగే ఇతర బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇది సాధ్యం కావడం లేదు. దీనిపై నిరసన తెలుపుతూ సాయి ఈశ్వర చారి తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. Teenmar Mallanna
Also Read: Revanth Reddy: ఆ ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ ను బొందపెట్టిన రేవంత్ ?





