Komatireddy: పవన్ కళ్యాణ్ ది గ్రేట్ హీరో.. మాట మార్చిన కోమటిరెడ్డి?

Komatireddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మొన్నటి వరకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ముఖ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఓ రేంజ్ లో ఊగిపోయారు. తెలంగాణ ప్రజలను తిట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలను ఇక్కడ ఆడనివ్వబోనని సంచలన ప్రకటన చేశారు. సినిమా ఆటోగ్రాఫి మంత్రిగా తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటన చేసి మూడు రోజులు పూర్తి కాలేదు.. అంతలోనే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట మార్చారు. Komatireddy

Minister Komatireddy u turn comments on Pawan Kalyan

పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యల మీద వెనక్కి తగ్గి నాలుక మడతేసి యూ టర్న్ తీసుకున్న మంత్రి కోమటిరెడ్డి.. మళ్లీ కొత్త వాదన ఎత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటూ వ్యాఖ్యానించారట. సారీ పవన్ కళ్యాణ్‌ను విమర్శించలేను, అది మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనియ్యం అన్న కోమటిరెడ్డి.. ఇంతలోనే మాట మార్చడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Komatireddy

Also Read: Revanth Reddy: ఆ ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ ను బొందపెట్టిన రేవంత్ ?

ఏపీకి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను విమర్శించలేను, అది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి, పోతుంటాయి. దాని మీద నో కామెంట్స్ అని తెలంగాణ ప్రజలను అవమానిస్తూ వ్యవహరించారు మంత్రి కోమటిరెడ్డి. అయితే దీనిపై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ పరువును మొత్తం ఏపీలో గంగలో కలిపారని ఫైర్ అవుతున్నారు. Komatireddy

Also Read: KCR: కేసీఆర్ చెంత‌కు వ‌రంగ‌ల్ లీడ‌ర్లు..ఇక కారు జోరును ఆప‌లేరు ?

Share your love