

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, లాంటి పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పెన్షన్లను మాత్రం ఇంకా పెంచలేదు. అటు రైతు బందు విజయంలో కూడా మాటతప్పినట్లు రైతులు ఫైర్ అవుతున్నారు. రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో కాలేదని మండిపడుతున్నారు. Revanth Reddy
Revanth Reddy comments on hindu gods over congress
అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. హిందూ దేవుళ్లను ఉద్దేశించి బాంబు పేల్చారు. మాంసం తినేవాడికి ఒక దేవుడు, పప్పు చారు వేసుకునే వాడికి మరో దేవుడు, పెళ్లికి కావాలని మరో దేవుని మొక్కుతారు అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. Revanth Reddy
Also Read: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ?
హిందూ దేవుళ్ళు అంటే కాంగ్రెస్ నాయకులకు అసలు ఇష్టం లేదని, ముస్లిం దేవుళ్ళు మాత్రమే వీళ్లకు కావాలని మండిపడుతున్నారు. హిందువుల ఓటర్లతోని విజయం సాధించి, హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిజెపి నేతలు. ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నారు హిందూ సంఘాల నేతలు. ఇక హిందూ దేవుళ్ళపై అప్పట్లో బొందుగల్లు అంటూ కేసిఆర్ చేసిన కామెంట్లతో గులాబీ పార్టీ నాశనమైందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు హిందూ దేవుళ్ళపైనే రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశాడని కౌంటర్లు పేల్చుతున్నారు. Revanth Reddy
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ కు జర్నలిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా ?







