Kavitha: బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్… గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పేరు పెట్టిన కవిత

Kavitha: కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రతిరోజు తలనొప్పి తీసుకువస్తున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ నీడన కొన్ని సంవత్సరాల పాటు ఉన్న కల్వకుంట్ల కవిత, ఏమైందో తెలియదు కానీ కెసిఆర్ కు దూరమయ్యారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ లాంటి బడా లీడర్లపై కామెంట్లు చేస్తూ గులాబీ పార్టీకి ముల్లుగా మారిపోయారు. పొద్దున లేస్తే చాలు గులాబీ పార్టీ నేతల పైన ఆరోపణలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha

Kavitha comments on brs mlas over kcr

ఇప్పటికే నీళ్ల మంత్రిగా చెప్పుకునే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి లాంటి బడా లీడర్లను టార్గెట్ చేసి కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి గులాబీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. ఇందులో భాగంగానే బీటీ బ్యాచ్ అలాగే యూటీ బ్యాచ్ అంటూ వాళ్లకు పేర్లు కూడా పెడుతున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha

Also Read: Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ‌.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?

బీటీ అంటే బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఇతర పార్టీల నుంచి కేసీఆర్ పార్టీలో గెలిచిన వాళ్ళు అంటూ వ్యాఖ్యానించారు. అదే యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లు అంటూ వ్యాఖ్యానించారు. ఉద్యమం నుంచి రాని వాళ్లు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఉద్యమ నాయకులు మాత్రం దారుణంగా ఓడిపోయినట్లు గుర్తు చేశారు. కాబట్టి ఇకనైనా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లకు కేసీఆర్ అవకాశం ఇవ్వాలని ఆమె పరోక్షంగా సూచనలు చేశారు. దీంతో కల్వకుంట్ల కవిత కామెంట్స్ వైరల్ గా మారాయి. Kavitha

Also Read: TDP: బందర్ కూటమి నేతల పంచాయితీ.. ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని రచ్చ ?

https://www.facebook.com/reel/2240215153170932

Share your love