KCR: హరీష్ రావుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వార్నింగ్ ?

BRS chief KCR warns Harish Rao
BRS chief KCR warns Harish Rao

KCR: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కొన్ని పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. గత నెల రోజులుగా హరీష్ రావు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కేసిఆర్ కు నివేదిక వచ్చిందట. KCR

BRS chief KCR warns Harish Rao

కెసిఆర్ అధికారం కోల్పోయిన తర్వాత హరీష్ రావు బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఓ పేపర్ క్లిప్ ను కూడా ప్రచూరించి వైరల్ చేస్తున్నారు. దీని ప్రకారం హరీష్ రావుకు కేసిఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి నేతలకు హరీష్ రావు దగ్గర అవుతున్నాడని కేసీఆర్ కు సమాచారం వచ్చిందట. దీంతో హరీష్ రావుకు స్ట్రాంగ్ వార్నింగ్ కేసీఆర్ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. KCR

Also Read: KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?

ఇది ఇలా ఉండగా.. గత వారం రోజులుగా హరీష్ రావు పై మరో ఆరోపణ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. జీవన్ రెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్ రావు ముగ్గురు కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మేరకు త్వరలోనే ఈ ముగ్గురు బహిరంగ సభ కూడా పెట్టబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని హరీష్ రావు బృందం స్పష్టం చేస్తోంది. కెసిఆర్ తోనే చివరి వరకు హరీష్ రావు ప్రయాణం ఉంటుందని చెబుతున్నారు. KCR

Also Read: BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు…నిధులు స్వాహా చేసిన బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు

https://www.facebook.com/photo/?fbid=122169844196663310&set=a.122095795184663310
Share your love