Jagga Reddy: క‌విత దూకుడుగా జ‌గ్గారెడ్డి బ్రేకులు..హ‌రీష్ రావు సేఫ్ జోన్ ?

Jagga Reddy Fires On Kalvakuntla Kavitha
Jagga Reddy Fires On Kalvakuntla Kavitha

Jagga Reddy: కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీకి విలన్ గా మారిన సంగతి తెలిసిందే. పొద్దున లేస్తే చాలు హరీష్ రావును టార్గెట్ చేసి ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ నుంచి ట్రబుల్ షూటర్ హరీష్ రావును దూరం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో జరిగిన తప్పిదాలను తెరపైకి తీసుకువచ్చి హరీష్ రావు పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Jagga Reddy

Jagga Reddy Fires On Kalvakuntla Kavitha over harish rao

మొన్నటి వరకు హరీష్ రావు పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నిజమే అని అందరూ అనుకునే లోపు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. కల్వకుంట్ల కవిత పరువు తీస్తూ, హరీష్ రావు ను సేఫ్ జోన్ లోకి నెట్టారు. హరీష్ రావు వల్ల గతంలో గులాబీ పార్టీ నుంచి జగ్గారెడ్డి బయటకు వెళ్లినట్లు కవిత ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోవడానికి హరీష్ రావు కారణం కాదంటూ కౌంట‌ర్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. Jagga Reddy

Also Read: Sravani Chowdary: అఖండ 2 సినిమాకు ఒకే రోజు రూ.200 కోట్లు..ఆడుకుంటోన్న వైసీపీ ?

కవిత కేసీఆర్ కూతురు కాకపోతే ఆమెకు గుర్తింపు ఎక్కడిదని ఇజ్జ‌త్ తీశారు. అందుకే ఆమెను కేసీఆర్ కూతురు అనే పిలుస్తున్నానని తెలిపారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. నేను హరీష్ రావు వల్ల పార్టీ మారలేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. కవిత అభిమాన సంఘాలు, ఆమె సోషల్ మీడియాలో ఇలాంటి పనికిరాని ప్రచారాలు చేయడం మానేసి విలువలవతో కూడిన రాజకీయాలు చేయమని సూచిస్తున్నానని వివ‌రించారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. దీంతో క‌విత ఊపుకు బ్రేకులు ప‌డిన‌ట్లు అయింది. Jagga Reddy

Also Read: Akhanda 2: వైసీపీ రెక్క‌లు విరిచేసిన బాల‌య్య‌..అఖండ 2 సినిమాలో అదిరిపోయే సీన్ ?

Share your love