Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు స‌స్పెండ్‌? ట్వీట్ వైర‌ల్

sunil kumar tweet on Raghu Rama Krishna Raju
sunil kumar tweet on Raghu Rama Krishna Raju
sunil kumar tweet on Raghu Rama Krishna Raju

Raghu Rama Krishna Raju: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుకు ఊహించని షాక్ తగిలింది. రఘురామకృష్ణం రాజును ఉద్దేశించి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ వివాదాస్పద పోస్టు చేశారు. నన్ను సస్పెండ్ చేసినట్లే నిన్ను కూడా చేయాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సునీల్ కుమార్. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేశారు మంచిదే అని ఏపీ ప్రభుత్వానికి మరో రిక్వెస్ట్ పెట్టారు ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్. Raghu Rama Krishna Raju

sunil kumar tweet on Raghu Rama Krishna Raju

మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణం రాజును కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి కదా? అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామకృష్ణ రాజును పదవుల నుంచి తొలగించాల్సిందే అంటూ పోస్ట్ పెట్టారు. చట్టం అందరికీ సమానమే అనే మెసేజ్ వెళ్లేలా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లాలని సెటైరికల్ ట్వీట్ చేశారు సునీల్ కుమార్. దీంతో రఘురామకృష్ణ రాజును సస్పెండ్ చేయాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వైసిపి శ్రేణులు. Raghu Rama Krishna Raju

Also Read: TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, క‌మీష‌న్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?

సునీల్ కుమార్ అడిగినదానిలో కూడా న్యాయం ఉందని నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణ రాజును కస్టడీలోకి తీసుకొని హింస చేశారని పివి సునీల్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా విచారణను ఎదుర్కొంటున్నారు పీవీ సునీల్ కుమార్. ఇందులో భాగంగానే సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్నారు సునీల్ కుమార్. ఫిబ్రవరి 14, 2026 సంవత్సరం వరకు ఈ సస్పెన్షన్ వేటు కొనసాగనుంది. Raghu Rama Krishna Raju

Also Read: BRS VS Congress: ఆసుపత్రికి వచ్చిన మహిళలపై అత్యాచారం..ఆ రాజ‌కీయ నేత భాగోతం ఇదే…

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_