

TTD: తిరుమల శ్రీవారి భూముల విషయంలో…చంద్రబాబు భారీ స్కాం చేస్తోన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టూరిజం భూమి తీసుకుని టీటీడీ భూమి ఒబెరాయ్ గ్రూప్ కట్టబెట్టడం దారుణం అంటూ నిప్పులు చెరిగారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. అలిరిపికి అతి సమీపంలో అత్యంత సమీపంలో ఈ భూములు కేటాయించారన్నారు. TTD
TTD Tirumala Srivari lands are stolen Chandrababu 3 thousand crore scam
ఈ నెల 11 తేదీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం.. 13న జీవో ఇచ్చినట్లు వెల్లడించారు. టూరిజం స్థలం ఎకరా 90 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే.. టిటిడి గజం 49 వేలు, ఎకరా కు 26కోట్ల రూపాయలు విలువ చేసే 20 ఎకరాలు 460 కోట్ల విలువైన భూములు దోచిపెట్టారని ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. బహిరంగ మార్కెట్ లోదీని విలువ 3 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. TTD
Also Read: TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, కమీషన్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?
కోహినూరు వజ్రం కంటే ఎక్కువ ధర టిటిడి స్థలంకు వెల కట్టలేమని వివరించారు. టూరిజం నుంచి టిటిడి తీసుకున్న స్థలం విలువ 18 కోట్లు మాత్రమేని స్పష్టం చేశారు. 460 కోట్ల రూపాయలు భూములు ఎలా దోచిపెట్టారని… ఒబెరాయ్ హోటల్ లీజు డీడ్ మనీ మాఫీ చేశారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం చేయడం మూలంగా భగవంతుడు ఇచ్చిన ఇనామ్ భూమి ప్రవేట్ వ్యక్తులకు దోచిపెట్టారని ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. TTD
Also Read: BRS VS Congress: ఆసుపత్రికి వచ్చిన మహిళలపై అత్యాచారం..ఆ రాజకీయ నేత భాగోతం ఇదే…







