

Congress: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు కొనసాగిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఎనిమిది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకుంది. అటు గులాబీ పార్టీకి 4,000 లకు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Congress
Congress The people who voted for BRS Sarpanch should be ashamed
బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలంటూ ఓ కాంగ్రెస్ నేత రెచ్చిపోయారు. ఓడిపోయామనే ఫ్రస్ట్రేషన్లో జనాలను నోటికొచ్చినట్టు తిడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి వాకిటి శ్రీహరి ముందే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన గ్రామాల ప్రజలను తిట్టాడు కాంగ్రెస్ నాయకుడు. Congress
Also Read: Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?
వనపర్తి జిల్లా ఆత్మకూర్లో కాంగ్రెస్ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మూలమల్ల, పిన్నంచర్ల గ్రామ ప్రజలను తిట్టారు మార్కెట్ యార్డ్ చైర్మన్ రహ్మతుల్లా. బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా.. సిగ్గుండాలి.. తెలివుండాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ నాయకుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు రెండు గ్రామాల ప్రజలు. ఎన్నికల రూల్స్ ప్రకారం, ఓటేసిన ప్రజలను తిడితే, రాజ్యాంగ ఉల్లంఘనే అంటున్నారు. Congress
Also Read: Tirumala: తెరపైకి మరో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





