Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..అస‌లు నిజాలు ఇవే ?

Kotha Prabhakar Reddy
Kotha Prabhakar Reddy
Kotha Prabhakar Reddy

Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. అయితే. దీనిపై కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. దుర్గం చెరువు ఆక్రమణపై తన మీద వస్తున్న వార్తలను కొట్టిపడేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం అంటూ క్లారిటీ ఇచ్చారు. దుర్గం చెరువులో మేము ఏదో 5 ఎకరాల భూమి కబ్జా చేశాను అని కేసు పెట్టారు.. అందులో మాకు గజం జాగా లేదు, ప్రభుత్వంకు కూడా గజం జాగా లేదని క్లారిటీ ఇచ్చారు. Kotha Prabhakar Reddy

duragam cheruvu case on Kotha Prabhakar Reddy

అక్కడ అందరూ వాహనాల పార్కింగ్ పెట్టుకుంటారు.. అక్కడే ఖాళీ స్థలంలో చెత్త డంప్ చేస్తారన్నారు. కావాలని కేసు పెట్టారు.. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని ఫైర్ అయ్యారు. నాపై కక్షతో కేసు పెట్టారని విమ‌ర్శ‌లు చేశారు. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయన్నారు.
దుర్గం చెరువులో నాకు భూమి లేదని క్లారిటీ ఇచ్చారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ స‌వాల్ చేశారు. Kotha Prabhakar Reddy

Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడ‌కు చిక్కులు ?

రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారని ఆగ్ర‌హించారు. ఏదో హైడ్రా వాళ్లకు పిర్యాదు చేశారు అంట మాకు సిబ్బంది ఫోన్ చేశారు.. నేను వెళ్తానని స్ప‌ష్టం చేశారు. కేసు పై లీగల్ ఫైట్ చేస్తాం.. పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను పోలీసులకు సహకరిస్తానన్నారు. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడం సహజం అంటూ వెల్లడించారు కొత్త ప్రభాకర్ రెడ్డి. బేషరతుగా కేసు విత్‌డ్రా చేయకపోతే… FTLలో ఇండ్లు కట్టారు.. ఆ ఇండ్ల ముందు ధర్నా చేస్తాన‌ని హెచ్చ‌రించారు కొత్త ప్రభాకర్ రెడ్డి. Kotha Prabhakar Reddy

Also Read: Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu