Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త‌ ట్విస్ట్..వినుత కోట భర్త వీడియో

driver-rayudu-murder-case-bojjala-sudheer-reddy-summons
driver-rayudu-murder-case-bojjala-sudheer-reddy-summons

Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇంచార్జి వినుత కోట భర్త వీడియో వైర‌ల్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వినుత భర్త చంద్రబాబు సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టారు. చెన్నై పోలీసులకంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌ను ఎలా బయటపెట్టారు? అని ప్ర‌శ్నించారు. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులను కలిశారు? అని నిల‌దీశారు. Driver Rayudu Case

Driver Rayudu Case another video vinutha husband

ఎఫ్ఐఆర్‌లో మాపేర్లు చేర్చక ముందే.. హత్య, ఆత్మహత్య అని తేల్చకు ముందే మాపై నిందారోపణలు చేశారని ఆగ్రహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్ని వ్యాపారాలు చెన్నై కేంద్రంగా చేస్తూ మాపై కక్షసాధింపు చర్యలు చేశారని నిప్పులు చెరిగారు. జూన్ 25 అపోలో ఆస్పత్రిలో సొంత మామ వైద్యం నిమిత్తం చేరారు.. అపోలో ఆస్పత్రిలో పార్కింగ్ లో సిసి కెమెరాలు ఆధారాలు ఉన్నాయన్నారు. తన రాజకీయ ప్రత్యర్ది ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా ఎమ్మెల్యే బొజ్జల చేశాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. Driver Rayudu Case

Also Read: Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్ర‌బాబు సంచ‌ల‌నం ?

మేము రిమాండ్ కు వెళ్లకముందే మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడారన్నారు. డ్రైవర్ రాయుడు మా తమ్ముడు, అంత్యక్రియలుకు హాజరు అవుతామని బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలు అందరికి తెలుసు.. ఎందుకు విచారణ చేపట్టరని ప్ర‌శ్నించారు. ఈ కేసులో సిట్ విచారణ, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు కోట చంద్రబాబు. Driver Rayudu Case

Also Read: Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?

https://www.instagram.com/telugufeedsite/reel/DTEiXLrk3_L
Share your love