CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మున్సిప‌ల్ కార్మికులు ఫైర్..!

CM Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తానే మున్సిప‌ల్ శాఖ మంత్రిని అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా న‌గ‌రంలో చెత్త పేరుకుపోయింద‌ని.. మున్సిపల్ కార్మికులు చెత్త సేకరించట్లేదని పేర్కొన్నారు. న‌గ‌రంలో 5,000 చెత్త ఆటోలు కొనిస్తే పని చేయట్లేదనే వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఇంత నిస్సిగ్గుగా అబద్దాలు ఎలా చెబుతార‌ని ప్రశ్నిస్తున్నారు కార్మికులు.

MUNCIPAL WORKERS FIRED ON CM REVANTH REDDY COMMETNS

ఉదయం 5 గంటల నుంచి చెత్త సేకరిస్తున్న కార్మికులపై అక్కసు ఎందుకని నిలదీశారు. వెంటనే మాకు క్షమాపణ చెప్పకపోతే సమ్మె చేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ చెత్త డంపింగ్ యార్డు వద్ద చెత్త ఆటోలతో కార్మికుల ధర్నా చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన స్వచ్చ ఆటోలతోనే నిస్వార్థంగా చెత్త సేకరిస్తున్నామని వెల్లడించారు. మున్సిపల్ మంత్రిగా రేవంత్ పట్టించుకోట్లేదని, ఒక్క ఆటో కూడా కొనలేదని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

Also Read : TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం

స్వచ్ఛ ఆటోలకు జీహెచ్ఎంసీ కనీసం ఈఎంఐలు ఇవ్వట్లేదని కార్మికుల ఆందోళన చేప‌ట్టారు. తమ మనోభావాలను తీసిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వ‌చ్ఛ ఆటోల‌కు జీహెచ్ఎంసీ క‌నీసం నెల‌వారీ ఈఎంఐలు కూడా చెల్లించ‌డం లేద‌ని కార్మికులు పేర్కొన్నారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని.. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన మున్సిప‌ల్ మంత్రిగా కాకుండా సీఎం గా కూడా రేవంత్ రెడ్డి స్పందించ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌ని కార్మికులు పేర్కొంటున్నారు.

Also Read : FUNCTION HALL : దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_