

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి, స్వాధీనం చేసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతారని సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. Jagan
Jagan sketch with ntr over tdp chandrababu
తెలుగుదేశం పార్టీలో ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానించే నేతలందరికి జగన్మోహన్ రెడ్డి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఇప్పటికే కలిసినట్టు చెబుతున్నారు. వచ్చే 2029 ఎన్నికల సమయానికి, జూనియర్ ఎన్టీఆర్ తో చక్రం తిప్పబోతున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు అందరిని ముందు పెట్టి… జూనియర్ ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని స్కెచ్ వేశారట జగన్మోహన్ రెడ్డి. Jagan
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ పరువు తీసిన గుత్తా..బండారం మొత్తం బయటపెట్టాడుగా ?
చాలాకాలంగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ కూడా జగన్ తో చేతులు కలిపినట్లు చెబుతున్నారు. తన తాత పార్టీని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నాడు అన్న కోపంతో జూనియర్ ఎన్టీఆర్ రగిలిపోతున్నారట. అందుకే జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్షుడు అవుతాడని కూడా అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Jagan
Also Read: Roja: రేవంత్, చంద్రబాబుపై రెచ్చిపోయిన రోజా..రాయలసీమకు వెన్నుపోటు ?







