

Roja: రేవంత్, చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి రోజా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడని, చంద్రబాబు దీనికి ఒప్పుకోవడంతో ఇది జరిగిందని ఆగ్రహించారు రోజా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసి రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని సీరియస్ అయ్యారు మాజీ మంత్రి రోజా . Roja
Roja gets angry with Revanth and Chandrababu
ఆ ప్రాంతంలో కరువు లేకుండా చేయాలని జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తీసుకొచ్చారని తెలిపారు.
రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడికెళ్లాడు ? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. ఇందుకోసమేనా పవన్ చంద్రబాబుతో కలిసింది, ఇందుకోసమేనా కూటమిని గెలిపించింది? నిలదీశారు మాజీ మంత్రి రోజా. Roja
Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?
మ్యాప్ లో ఈ రాష్ట్రం లేకుండా చేసేందుకే చంద్రబాబు ఇంకో 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నువ్వు రాయలసీమకు మోసం చేస్తున్నావని నీ ఓటుకు నోటు దొంగ పార్టనర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడని చురకలు అంటించారు. హైదరాబాద్‌లో నీ ఆస్తులు కాపాడుకోవడానికి రాయలసీమకు అన్యాయం చేస్తావా? అంటూ ప్రశ్నించారు వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె.రోజా. Roja
Also Read: Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం ?







