Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న ?

Teenmar Mallanna
Teenmar Mallanna

Teenmar Mallanna: కెసిఆర్ కూతురు దేవనపల్లి కవిత బండారం బయటపెట్టాడు తీన్మార్ మల్లన్న. ఆరు నెలల కిందనే దేవనపల్లి కవితకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చేదని సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం చేస్తాడన్న సంగతి తెలిసిందే. Teenmar Mallanna

Teenmar Mallanna mass challenge to Devanapalli kavitha

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్న, కెసిఆర్ కూతురు దేవనపల్లి కవితపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దేవనపల్లి కవిత చేతులు కలిపారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీతో కలిసిన నువ్వు మంత్రి పదవి జాబితాలో ఉన్నావని వెల్లడించారు. వి6 వివేక్ తో పాటు కవితకు కూడా మంత్రి పదవి వచ్చేదని వెల్లడించారు తీన్మార్ మల్లన్న. Teenmar Mallanna

Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప‌రువు తీసిన గుత్తా..బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టాడుగా ?

కానీ చివరి నిమిషంలో అసలు సిసలు కాంగ్రెస్ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారట. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దేవనపల్లి కవితకు పదవి ఇవ్వాలని సోనియాను అడిగారట. కానీ చివరి నిమిషంలో కవిత పేరును పక్కకు పెట్టిన కాంగ్రెస్ మరో ముగ్గురికి ఆ పదవి ఇచ్చింది. ఇదే విషయాన్ని తాజాగా తీన్మార్ మల్లన్న బయటపెట్టారు. ఇది అబద్దమని తన పిల్లలపైన ప్రమాణం చేసి చెప్పాలని తీన్మార్ మల్లన్న ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. Teenmar Mallanna

Also Read: Roja: రేవంత్‌, చంద్ర‌బాబుపై రెచ్చిపోయిన రోజా..రాయ‌ల‌సీమ‌కు వెన్నుపోటు ?

Share your love