Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?

jagan kcr chandrababu
jagan kcr chandrababu

Jagan: చంద్రబాబు నాయుడును ప‌రువు తీశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. కేసీఆర్ త‌ర‌హాలోనే విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు నాయుడు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనౌన్స్‌మెంట్స్ ఇస్తున్నాడని.. ప‌బ్లిసిటీ మాత్రమే.. నాట్ రియాలిటీ అంటూ చుర‌క‌లు అంటించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. Jagan

Jagan comments on chandrababu over mou

చంద్ర‌బాబు మ‌న‌స్త‌త్వం ఎలాంటిదంటే.. Credit without contribution అంటూ ఫైర్ అయ్యారు. ఎవ‌రో చేస్తే క్రెడిట్ తాను తీసుకోవ‌డానికి ఏ మాత్రం సంకోచం లేకుండా, క‌ళ్లార్ప‌కుండా అబ‌ద్ధాలు ఆడుతాడని చుర‌క‌లు అంటించారు. క్రెడిట్ త‌న ఖాతాల్లో వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ని విమ‌ర్శ‌లు చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. Jagan

Also Read: Jagan: చంద్ర‌బాబుకు వెన్నుపోటు..ఎన్టీఆర్ తో క‌లిసి జ‌గ‌న్ భారీ స్కెచ్ ?

రోజుకు 8 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోతుంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీళ్లు డ్రా చేసే కెపాసిటీ కేవ‌లం 0.66 టీఎంసీలు (మాల్యాల, ముచ్చుమర్రి లిఫ్టులు) మాత్ర‌మే అని షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టారు. శ్రీ‌శైలం ఫుల్ రిజ‌ర్వాయ‌ర్ లెవ‌ల్ 885, పోతిరెడ్డి పాడు నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేర‌కు నీళ్లు బ‌య‌ట‌కు రావాలంటే 881 అడుగులు ఉండాలని వెల్ల‌డించారు. కిందున్న రాయ‌ల‌సీమ‌, నెల్లూరు ప్రాంతాల ప‌రిస్థితి ఏంట‌న్న ఆలోచ‌న చంద్ర‌బాబుకు ఉందా..? అని ప్ర‌శ్నించారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. Jagan

Also Read: Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న…

Share your love