

Harish Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలపై రేవంత్ రెడ్డి కక్ష్య కట్టాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్ ను వేధించాడని మండిపడ్డారు. సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. Harish Rao
Harish Rao comments on prabhas, allu arjun
ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారని నిలదీశారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారని ఫైర్ అయ్యారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని ఆగ్రహించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. Harish Rao
Also Read: Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న నుంచి చేజారిపోయిన Q News యూట్యూబ్ ఛానల్ ?
ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా..? అని ఫైర్ అయ్యారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడన్నారు. కానీ.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. Harish Rao
Also Read: komatireddy venkat reddy: నాకింత విషమిచ్చి చంపేయండి..లేడీ ఐఏఎస్ వార్తలపై సీరియస్?







