

Mumbai Elections: మహారాష్ట్రలోని ముంబై నగరంలో మరోసారి భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. తాజాగా జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 118 స్థానాలతో మహాయుతికి ముంబై నగరంలో స్పష్టమైన మెజారిటీ రావడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. Mumbai Elections
Mumbai Mahapalika Election Voting Municipal Corporation Elections Voting
మహాయుతి కూటమి పేరుతో రంగంలోకి దిగిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎలాగైనా అధికారంలో ఉన్న పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. దానికి తగ్గట్టుగానే ముంబైలో కూడా రిజల్ట్ వచ్చింది. 29 కార్పొరేషన్లకు గాను 25 చోట్ల మహయుతి విజయం సాధించింది. Mumbai Elections
Also Read: BRS: మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను..స్పీకర్ కు బిగ్ షాక్!
ఠాక్రే సోదరులు కలిసినప్పటికీ బిజెపి స్పీడును అడ్డుకోలేకపోయారు. అటు ముంబైలో శివసేన కేవలం 65 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇక మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోర్చుచూరి జరిగిందని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. చెరగని సిరాకు బదులు మార్కర్ వాడారని ఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీన్ని బిజెపి నేతలు మాత్రం కొట్టి పారేస్తున్నారు. Mumbai Elections
Also Read: kavitha: ఆ మీడియా ఛానల్ పై కన్నేసిన దేవనపల్లి కవిత ?







