Telangana Municipal Elections 2026: మున్సిప‌ల్ ఎన్నిక‌ల తేదీలు వ‌చ్చేశాయి.. పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న

Telangana Municipal Elections 2026
Telangana Municipal Elections 2026
Telangana Municipal Elections 2026

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. ఇప్పటికే నోటిఫికేషన్ రాకముందే పట్టణాలలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. దావతులు, పార్టీలు చేసుకుంటూ… ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు అభ్యర్థులు. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీ కంటే ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. Telangana Municipal Elections 2026

Telangana Municipal Elections 2026 Update

ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి, ఆ తర్వాత విద్యార్థుల పరీక్షలు వరుసగా వస్తాయని వెల్లడించారు. అందుకే వీలైనంత త్వరగా ఫిబ్రవరి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఫిబ్రవరి నెలలోనే రంజాన్ మాసం కూడా ప్రారంభం కానుంది అన్నారు. ఇలాంటి నేపథ్యంలో త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. Telangana Municipal Elections 2026

Also Read: Duvvada Srinivas: మ‌రో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అస‌లేం జ‌రిగిందంటే?

ఈ మేరకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అయినట్లు కూడా గుర్తు చేశారు. మేడారంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. Telangana Municipal Elections 2026

Also Read: Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu