Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇజ్జ‌త్ తీసిన కూతురు ?

Speaker Gaddam Prasad
Speaker Gaddam Prasad
Speaker Gaddam Prasad

Speaker Gaddam Prasad: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఇవాల్టి నుంచి ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి హడావిడి ఎక్కువగానే ఉంది. అటు ప్రతిపక్షం గులాబీ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ప్రతి వార్డులో కూడా గట్టి పోటీ నెలకొంది. Speaker Gaddam Prasad

Speaker Gaddam Prasad daughter Ananya is contesting as the candidate for Vikarabad Municipal Chairman

అధికార పార్టీ కాంగ్రెస్ కావడంతో వాళ్లకి ఎక్కువగా మున్సిపల్ స్థానాలు దక్కే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నికల సిత్రాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూతురు అనన్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా స్పీకర్ కూతురు పోటీ చేస్తున్నారట. Speaker Gaddam Prasad

Also Read: MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జ‌న‌సేన ఎమ్మెల్యే..మ‌రో వీడియో.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… తన తండ్రి స్పీకర్ అలాగే ఎమ్మెల్యే కావడంతో వార్డును ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తానని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా ఆమె బిత్తర పోయారు. వెనకాల క్యాడర్ ను అడిగి మరి తన వార్డు చెప్పారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి తన వార్డు ఏ నెంబరు తెలియకపోతే, అభివృద్ధి ఏం చేస్తుందని సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు. కాగా మున్సిపల్ ఎన్నికలు నవంబర్ 11వ తేదీన జరగనుండగా కౌంటింగ్ 13వ తేదీన ఉంటుంది. Speaker Gaddam Prasad

Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu