బరాబర్ ప్రేమిస్తా మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

మూవీ: బారాబర్ ప్రేమిస్తా

నటీనటులు: చంద్రహాస్, మేఘన ముఖర్జీ , అర్జున్ మహీ, మీసాల లక్ష్మణ్ తదితరులు

నిర్మాతలు – గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్

సమర్పణ – కాకర్ల సత్యనారాయణ

సంగీతం – ధృవన్

సినిమాటోగ్రఫీ – శేఖర్

ఎడిటింగ్ – చిత్ర బృందం

కథ, మాటలు – సంపత్ రుద్ర

నిర్మాణ సంస్థలు – సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్

విడుదల తేదీ: 06- ఫిబ్రవరి – 2026

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన బరాబర్ ప్రేమిస్తా సినిమా యూత్‌ఫుల్ కమర్షియల్ టచ్‌తో రూపొందిన లవ్ డ్రామా. ఇటీవల జరిగిన కాంట్రవర్సీ వల్ల ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన చర్చను సొంతం చేసుకుంది. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో, సిసి క్రియేషన్స్ మరియు ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల చేశారు. ప్రేమ, కుల వ్యవస్థ, గ్రామీణ వాతావరణాన్ని మేళవిస్తూ రూపొందిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.  

కథ: కథ మొత్తం రుద్రారం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడ రెండు కులాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న విభేదాలు గ్రామ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. గతంలో జరిగిన ఓ విషాద సంఘటన ఈ విభేదాలకు కారణమవుతుంది. అలాంటి నేపధ్యంలో వేర్వేరు వర్గాలకు చెందిన చందు, బుజ్జమ్మ ప్రేమలో పడతారు. తమ ప్రేమను గ్రామం అంగీకరించదని తెలుసుకుని కేరళకు వెళ్లిపోతారు. కానీ అక్కడ కూడా సమస్యలు ఎదురవడంతో తిరిగి ఊరికి వస్తారు. ఊరిని ఏకం చేసి తమ ప్రేమను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తారు. చివరకు గ్రామం మారుతుందా? ప్రేమ గెలుస్తుందా? అన్నది కథలో కీలకం.

నటీ నటులు: చందు పాత్రలో చంద్రహాస్ ఫుల్ ఎనర్జీతో నటించి యూత్‌ను ఆకట్టుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ సీక్వెన్సులు సినిమాకు మంచి కమర్షియల్ వైబ్ ఇస్తాయి. గత సినిమాలతో పోలిస్తే అతనిలోని మెచ్యూరిటీ స్పష్టంగా కనిపిస్తుంది. హీరోయిన్ మేఘన ముఖర్జీ సహజమైన నటనతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆమె పాత్రకు అవసరమైన ఎమోషన్‌ను బాగా పండించింది. ప్రతినాయకుడిగా అర్జున్ తన పాత్రకు న్యాయం చేశాడు. మీసాల లక్ష్మణ్ కీలక సన్నివేశాల్లో సర్‌ప్రైజ్ చేస్తాడు. మిగతా పాత్రలన్నీ కథలో భాగంగా బాగా సెట్ అయ్యాయి.

సాంకేతిక విభాగం: సాంకేతికంగా ఈ సినిమాకు ధృవన్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు సరైన ఎనర్జీ ఇస్తాయి. శేఖర్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించింది. విజువల్స్ క్లిన్‌గా, కలర్ టోన్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉండటంతో సినిమా ఎక్కడా ల్యాగ్ అనిపించదు. డైలాగ్స్ సింపుల్‌గా ఉండి యూత్‌కు కనెక్ట్ అవుతాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి ఫ్రేమ్‌లో పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: 

యూత్ ఫుల్ లవ్ డ్రామా

లీడ్ యాక్టర్స్ పర్ ఫామెన్స్

సంగీతం

మైనస్ పాయింట్స్

అక్కడక్కడా నెమ్మదితనం

తీర్పు: 

బరాబర్ ప్రేమిస్తా సినిమా కొత్త కథ కాకపోయినా, యూత్‌ఫుల్ ప్రెజెంటేషన్‌తో ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. ప్రేమ, సమాజ సమస్యలను కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. సరదాగా థియేటర్‌కు వెళ్లి లవ్ డ్రామా చూడాలనుకునే యూత్ ఆడియెన్స్‌కు ఇది ఓ డీసెంట్ ఆప్షన్.

ట్యాగ్ లైన్: ప్రేమ కోసం ఊరినే మార్చే ధైర్యం

రేటింగ్ : 3.5/5