KTR : చిక్కుల్లో KTR.. వాటిని అంగీక‌రించే ప్ర‌సక్తే లేదు..?

ktr

KTR : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో చిక్కుకున్నారంటే ఔన‌నే స‌మాధానం చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కొంత మంది కేటీఆర్ సేవా స‌మితి, కేటీఆర్ సేన వంటి పేర్ల‌తో కొన్ని కార్య‌క‌లాపాలు చేప‌డుతున్నారు. తాజాగా ఈ విష‌యం పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

KTR in trouble..’Collections in the name of KTR Seva Samiti

కేటీఆర్ సేవా స‌మితి, కేటీఆర్ సేన వంటి పేర్ల‌తో కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌త్యేక గ్రూపులు, సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. త‌న పేరుతో ఎలాంటి ప్రైవేట్ సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌కు తాను అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసారు. ఒక‌వేళ త‌న‌పై అభిమానం క‌నుక ఉన్న‌ట్ట‌యితే ఆ శ్ర‌మ‌ను ఉత్సాహాన్ని నేరుగా బీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతం కోసం ఖర్చు చేయాల‌ని ఆయ‌న అభిమానుల‌కు పిలుపునిచ్చారు.

Also Read : CM REVANTH REDDY : రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం.. కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు..?

త‌న పేరుతో ఎలాంటి సంస్థ‌ల‌కు అనుమ‌తి లేద‌ని.. అలాంటి ప్ర‌య‌త్నాల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో కూడా ప్రోత్స‌హించ‌బోమ‌ని తెలిపారు కేటీఆర్. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన త‌రువాత శ్రేణుల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకురావ‌డం బీఆర్ఎస్ కు చాలా అవ‌స‌ర‌మ‌ని.. నాయ‌కుల వ్య‌క్తిగ‌త ఇమేజ్ కంటే పార్టీ వ్య‌వ‌స్థ‌నే చాలా బ‌ల‌మైన‌ద‌ని నిరూపించ‌డానికి కేటీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : CM REVANTH REDDY : హైదరాబాద్‌ మెట్రోను L & T నుంచి పూర్తిగా స్వాధీనం రేవంత్ నిర్ణయం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu