DONATION LAND : భూదాన భూముల్లో హై టెన్ష‌న్.. ఇళ్ల‌ను తొల‌గించొద్దంటూ..!

Donation Land

DONATION LAND : ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుంది. 2014 లో 62 ఎక‌రాల భూదాన భూమిలో దాదాపు 18 ఎక‌రాల్లో 600 కుటుంబాలు రెండువేల జ‌నాభా ఇళ్లు లేని నిరుపేద‌లు ఇళ్లు నిర్మించుకొని అక్క‌డ నివ‌సిస్తున్నారు. 15 సంవ‌త్స‌రాల క్రితం భూదాన్ భూముల వాళ్లు పేద‌ల‌కు ప‌ట్టాలు ఇచ్చారు. వాళ్ల‌కు నివాసం ఉండ‌టానికి హ‌క్కు కూడా ఉంద‌ని హైకోర్టు కూడా వాళ్ల‌కు ప‌ట్టాలు ఇచ్చింది. DONATION LAND

Victims plead not to evict houses in Khammam land donation land

పేద‌ల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని హై కోర్టు స్టే ఇచ్చి.. వాళ్ల‌కు నీళ్లు, క‌రెంట్, స్కూల్ కూడా ఇవ్వండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్ని ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా పేద‌ల ఇళ్ల‌ను ఎందుకు కూల్చుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని అడ్వ‌కేట్ సుగుణ‌రావు వాపోతున్నారు. అదే భూమి ప‌క్క‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు త‌మ వ్యాపారాల‌ను కొన‌సాగిస్తుండ‌గా.. మ‌రోవైపు క‌బ్జాదారులకు అధికారులు కొమ్ము కాస్తున్నార‌ని భూదాన బాధితులు ఆరోపిస్తున్నారు. 

Also Read : KTR : చిక్కుల్లో KTR.. వాటిని అంగీక‌రించే ప్ర‌సక్తే లేదు..?

ముఖ్యంగా మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున నుంచి వంద‌లాది మంది పోలీస్ బ‌ల‌గాల‌తో మున్సిప‌ల్ సిబ్బంది వంద‌ల ట్రాక్ట‌ర్లు, జేసీబీల‌తో భూదాన భూమి ఆవ‌ర‌ణ‌లోకి చేరుకున్నారు. వంద‌లాది పోలీసులు ఒక్క‌సారిగా భూదాన భూముల్లోకి అడుగుపెట్టడంత పేద ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. తాము నిర్మించుకున్న ఇళ్ల‌ను తొల‌గించ‌వ‌ద్దని అధికారుల కాళ్ల‌, వేళ్ల ప‌డ్డ క‌నిక‌రించ‌కుండా రేకుల షెడ్డు గుడిసెల‌ను జేసీబీల‌తో తొల‌గించ‌డంతో స్థానికులు క‌న్నీరుమున్నీర‌య్యారు.

Also Read : CM REVANTH REDDY : రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం.. కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు..?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu