
PILOT ROHIT REDDY : తెలంగాణలో రోజు రోజుకు సంచలన సంఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎప్పుడూ ఎవ్వరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చెప్పడం కష్టంగా మారింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ గా నమోదైంది. మొయినాబాద్ ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించేందుకు వెళ్లింది. PILOT ROHIT REDDY
Former MLA pilot Rohit Reddy tested positive for drugs
ఫాం హౌస్ లోపలికి వెళ్లేందుకు టీమ్ ప్రయత్నించగా.. వారిని పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు అడ్డుకొని నానా హంగామా చేశారు. అనంతరం రివాల్వర్ తో నిందితులు గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్టు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు అక్కడికీ చేరుకొని కాల్పులు జరిపిన వారితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న రివాల్వర్ స్వాధీనం చేసుకొని ఫాం హౌస్ లో సోదాలు నిర్వహించారు.
Also Read : JEEVAN REDDY : రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బిగ్ షాక్..!
ఈ కాల్పులు జరపగా 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. రోహిత్ రెడ్డికి పాజిటివ్ గా తేలింది. మరో ఐదుగురికి కూడా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. పట్టుబడిన వారిలో పైలెట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, నమిద్ మిశ్రా, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, శ్రవణ్ కుమార్, నివీత్ శర్మ, నల్లపునేని విజయ్ కృష్ణ, రితేశ్ రెడ్డి, మొరగనేని రమేష్ ఉన్నారు. గాల్లోకికాల్పులు జరిపింది ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిద్ మిశ్రా అని.. పైలెట్ సోదరుడికి సంబంధించిన రివాల్వర్ అని పోలీసులు నిర్ధారించారు.
Also Read : KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?




