FOOT BALL : ఫుట్‌బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్‌మాల్

Foot Ball

FOOT BALL : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పిచ్చి మొద‌లైంద‌ని ప‌లువురు నేత‌లు పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఫుట్ బాల్ గ్రౌండ్ టెండ‌ర్ల‌లో గోల్ మాల్ జ‌రుగుతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు లంచం తీసుకొని అర్హ‌త లేని సంస్థ‌ల‌కు మైదానాల అభివృద్ధి ప‌నులు ఇంజినీర్లు అప్ప‌గించారు. FOOT BALL

Golmaal in football ground tenders

ఫుట్ బాల్ ఆట మీద ఉన్న ఆస‌క్తితో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫుట్ బాల్ మైదానాల‌ను అభివృద్ధి చేయాల‌ని జీహెచ్ఎంసీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిని అనువుగా తీసుకొని బ‌ల్దియా ఇంజినీర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అర్హ‌త లేని సంస్థ‌ల‌కు ప‌నులు అప్ప‌గించి అందుకు జీహెచ్ఎంసీ సీనియ‌ర్ ఇంజినీర్ రూ.50లక్ష‌ల డీల్ మాట్లాడుకున్న‌ట్టు స‌మాచారం.

Also Read : KTR : చిక్కుల్లో KTR.. వాటిని అంగీక‌రించే ప్ర‌సక్తే లేదు..?

మ‌రోవైపు ప‌నుల విలువ‌ను భారీగా పెంచి టెండ‌ర్ అంచ‌నాల‌ను రెట్టింపు చేశార‌ని తోటి ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌టువంటి సంస్థ‌కు టెండ‌ర్లు ద‌క్క‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని.. ఇటీవ‌ల రూ.15 ల‌క్ష‌ల లంచం తీసుకుంటూ ఏసీబీకి కూడా సూప‌రింటెండెంట్ ఇంజినీర్ నుంచి శేరిలింగంప‌ల్లి జోన్, ఖైర‌తాబాద్ జోన్ ప‌లు జోన‌ల్ ఇంజినీర్లు ఆ సంస్థ‌కు గ‌డిచిన రెండేళ్ల‌లో రూ.60 కోట్ల ప‌నులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫుట్ బాల్ పై ప‌లు గోల్ మాల్ జ‌రిగింద‌ని స్ప‌ష్టంగా అర్థమ‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CM REVANTH REDDY : హైదరాబాద్‌ మెట్రోను L & T నుంచి పూర్తిగా స్వాధీనం రేవంత్ నిర్ణయం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu