

HARISH RAO : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మీద పెట్టిన శ్రద్ధ హెల్త్ సిటీ మీద పెడితే బాగుండేది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ హెల్త్ సిటీ మీద శ్రద్ధ పెడితే.. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ పెట్టాడని పేర్కొన్నారు. కేసీఆర్ పేదల కోసం హెల్త్ సిటీ నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ల సిటీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. HARISH RAO
harish-rao-focus-on-future-city-health-city-would-have-been-better
రేవంత్ రెడ్డి అన్ని మాటలతోనే కాలం వెల్లదీస్తున్నాడని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, 1 శాతం రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ తో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కూడా తెచ్చిందని గుర్తు చేశారు. దానిని రెండున్నర సంవత్సరాల కాలం పక్కన పెట్టి ఒక్క శాతాన్ని 1.5 శాతం చేసి.. అదేదో కొత్తగా తెచ్చినట్టు తీపి కబురు అంటూ మీడియాలో చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. HARISH RAO
Also Read : DONATION LAND : భూదాన భూముల్లో హై టెన్షన్.. ఇళ్లను తొలగించొద్దంటూ..!
సీఎం రేవంత్ రెడ్డి విచ్ఛలవిడిగా వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం కాలం చెల్లిందని.. రాబోయే రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుందని తెలిపారు. అతి చేసిన అధికారుల పేర్లంటిని డైరీలో రాసి పెట్టుకున్నామని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
Also Read : FOOT BALL : ఫుట్‌బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్‌మాల్







