TELANGANA : తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ స‌ర్కార్ శ్రీకారం

TELANGANA

TELANGANA : తెలంగాణ వ్య‌వ‌సాయ రంగంలో స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీక‌రించ‌డం, రైతుల‌కు కూలీల ఖ‌ర్చును త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా భారీ స‌బ్సీడీతో వ్య‌వ‌సాయ డ్రోన్లు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కార్య‌చ‌ర‌ణ‌ను వెల్ల‌డించింది. పంట‌ల‌కు పురుగుల మందులు, సూక్ష్మ పోషకాల‌ను పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఒక్కో డ్రోన్ పై 40 శాతం స‌బ్సీడీ లేదా గ‌రిష్టంగా రూ.4ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సాయం అందించ‌నున్నారు.

REVANTH REDDY GOVERNMENT GAVE GOOD NEWS TO TELANGANA FARMERS

ముఖ్యంగా చిన్న‌, స‌న్నాకారు రైతులు.. ఎస్టీ, ఎస్సీ, మ‌హిళా రైతుల‌కు అధిక‌ ప్రాధాన్య‌త ఉండ‌నుంది. తొలిద‌శ‌లో భాగంగా ప్ర‌తి జిల్లాకు 10 డ్రోన్ల చొప్పున పంపిణీ చేయ‌నున్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేసే స‌మ‌యం దాదాపు 70 నుంచి 80 శాతం వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని తెలిపారు. కూలీల కొర‌త స‌మ‌స్య తీర‌డ‌మే కాకుండా ఖ‌ర్చు కూడా భారీగా త‌గ్గుంద‌న్నారు. కేవ‌లం డ్రోన్లు మాత్ర‌మే కాకుండా వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌లో కొన్ని ప‌రిక‌రాల‌ను ప్ర‌భుత్వం అందిస్తోంది.

Also Read : Alireza Arafi: ఇరాన్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. తాత్కాలిక సుప్రీం లీడర్ అరాఫీ మృతి?

వాటిలో ప‌సుపు ఉడ‌క‌బెట్టే, పాలిషింగ్ చేసే యంత్రాలు, గెల‌లు కోయ‌డానికి ఉప‌యోగ‌ప‌డే టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్ వంటివి అందించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 9,936 యంత్రాల‌ను పంపిణీ చేశారు. ప్ర‌భుత్వం రూ.28.74 కోట్ల స‌బ్సీడీని నేరుగా రైతుల‌కు అందించింది ప్ర‌భుత్వం. అర్హ‌త‌లు, స‌బ్సీడీ శాతం, అప్లికేష‌న్ ప్ర‌క్రియ‌కు సంబంధించి ఆయా జిల్లాల వ్య‌వసాయ కార్యాల‌యాల్లో అందుబాటులో ఉంటాయి. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో మిగిలిన వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల‌ను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.

Also Read : TTD: టీటీడీ చైర్మన్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి ?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment