ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..!

Andhrapradesh

ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..! ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది ప్ర‌భుత్వం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు తీసుకురానుంది. ఇప్ప‌టికే నియ‌మించిన క‌మిటీ సిఫార‌సుల ప్ర‌కారం.. ప‌లు గ్రామ‌పంచాయ‌తీల‌కు కేట‌గిరీల‌కు విభ‌జించింది. గ్రామ‌పంచాయ‌తీల‌ను పున‌ర్ వ్య‌వ‌స్తీక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

AP GOVERNMENTS DECISSION TO REDISTRIBUTE GRAM PANCHAYATS ACROSS STATE

అన్న‌మ‌య్య జిల్లా అనంత‌పురం, అన‌కాప‌ల్లి, అల్లూరి, తూర్పు గోదావ‌రి, అంబేద్క‌ర్ కోన‌సీమ, ఏలూరు, బాప‌ట్ల, చిత్తూరు జిల్లాల‌లోని ప‌లు పంచాయ‌తీల‌ను గ్రేడ్-1, గ్రేడ్ 2 , గ్రేడ్ 3 కేట‌గిరీలుగా వ‌ర్గీక‌రిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. గ్రామాల‌లో కూడా ప‌ట్ట‌ణాల మాదిరిగా స‌దుపాలు క‌ల్పించేందుకు నూత‌నంగా రూర్బ‌న్ పంచాయ‌తీల ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం.

Also Read : TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం

10వేల జ‌నాభా ఉంటే రూర్బ‌న్ పంచాయ‌తీలుగా విభ‌జించింది. ఈ మేర‌కు జిల్లాల క‌లెక్ట‌ర్లు, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది క‌మిష‌న‌ర్ త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో వ‌ర్గీక‌రించిన గ్రామ‌పంచాయ‌తీలు నిధులు స‌జావుగా వినియోగించేందుకు సీఎంఎఫ్ఎస్ పోర్ట‌ల్ లో వివ‌రాల‌ను ఉంచాల‌ని కోరింది. ఆన్ లైన్ డేటాలో అవ‌స‌ర‌మైన మార్పులు చేయాల‌ని ఏపీ ట్రేజ‌రీ డైరెక్ట‌ర్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

Also Read : FUNCTION HALL : దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu