WOMENS RESERVATION : మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల పై కేంద్రం సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

womens reservation
womens reservation
women reservation
WOMENS RESERVATION :   మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల చ‌ట్టం పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నకు ముందే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు పార్ల‌మెంట్ ఆమోదించిన చ‌ట్టాన్ని స‌వ‌రించి ఏప్రిల్ 02వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌బోయే బ‌డ్జెట్ మ‌లివిడ‌త స‌మావేశాల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. WOMENS RESERVATION

Central Administrative Decision on Women’s Reservation

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఈ మేర‌కు క‌స‌ర‌త్తు చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు అమ‌లులోకి వ‌చ్చిన‌ట్ట‌యితే అసెంబ్లీ లోక్ స‌భలో మ‌హిళ‌ల ప్రాతినిథ్యం పెరుగ‌నుంది. తెలంగాణలో ప్ర‌స్తుతం 119 శాస‌న స‌భ స్థానాలు ఉండ‌గా.. వీటిలో సుమారు 40 శాతం సీట్లు మ‌హిళ‌ల‌కు కేటాయించాల్సి ఉంటుంది. అదేవిధంగా లోక్ స‌భ‌కు 17 స్థాలు ఉంటే.. సుమారు 5 లేదా 6 సీట్లు మ‌హిళ‌ల‌కు ద‌క్క‌నున్నాయి. WOMENS RESERVATION

Also Read : CM REVANTH REDDY : బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను బ‌లి చేస్తున్న రేవంత్ రెడ్డి

ఇక ఏపీ లో 175 శాస‌న స‌భ స్థానాలు ఉండ‌గా.. అందులో మ‌హిళ‌ల‌కు సుమారు 57-58 సీట్లు, 25 లోక్ స‌భ స్థానాల్లో 8 మంది మ‌హిళ‌ల‌కు ద‌క్క‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెర‌గాల్సి ఉంది. ఇదే జ‌రిగితే మ‌హిళ‌ల ప్రాతినిథ్యం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏం జ‌రుగుతుంద‌నేది వేచి చూడాలి మ‌రీ.

Also Read : TELANGANA : ఎమ్మెల్యేలు దానం, క‌డియంల‌కు ఊర‌ట‌.. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను కొట్టేసిన స్పీక‌ర్

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_