DONALD TRUMP : ట్రంప్ న‌కు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ

DONALD TRUMP : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కి న్యూయార్క్ ఫెడ‌ర‌ల్ కోర్టులో మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. ముఖ్యంగా ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్‌ల సొమ్మును తిరిగి కంపెనీలకు రిఫండ్ చేయాలని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్‌లు రాజ్యాంగానికి వ్యతిరేకమని తీర్పునిచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. 1977 అంత‌ర్జాతీయ అత్య‌వ‌స‌ర ఆర్థిక అధికారాల చ‌ట్టం కింద ట్రంప్ గ‌త ఏడాది విధించిన భారీ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన తెలిసిందే.

TRUMP SETBACK IN NEWYORK FEDERAL COURT

ఈ నేప‌థ్యంలో అట్మ‌స్ ఫిల్ట్రేష‌న్ అనే సంస్థ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ సంద‌ర్భంగా దిగుమ‌తి దారులు రిఫండ్ పొందేందుకు అర్హులు అని న్యూయార్క్ ఫెడ‌ర‌ల్ కోర్టు జ‌డ్జీ రిచ‌ర్డ్ ఈట‌న్ పేర్కొన్నారు. ఈ సుంకాల సొమ్ము రిక‌వ‌రీకి సంబంధించిన కేసుల‌ను తానే చూడ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. సుప్రీంకోర్టులో ఇటీవ‌ల ట్రంప్ టారిఫ్ లు చెల్ల‌వ‌ని స్పష్టం చేసింది. కానీ రిఫండ్ ల గురించి మాత్రం ఎలాంటి ప్ర‌స్తావ‌న చేయ‌లేదు. తాజా వెలువ‌డిన తీర్పుతో ఈ ప్ర‌క్రియ పై కొంత మేర‌కు ఓ స్ప‌ష్టత వ‌చ్చిన‌ట్ట‌యింది.

Also Read : KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝ‌ల‌క్..!

ఈ తీర్పు పై అప్పీల్ చేస్తామ‌ని ట్రంప్ త‌ర‌పు న్యాయ‌వాదులు పేర్కొంటున్నారు. వాస్త‌వానికి క‌స్ట‌మ్స్, బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్స్ ద్వారా యూఎస్ లోకి దిగుమ‌తి అయ్యే అన్ని వ‌స్తువులు లిక్విడేష‌న్ అనే ప్ర‌క్రియ‌లోకి వ‌స్తాయ‌ని.. ఈ వ‌స్తువుల‌పై అధికారులు విధించిన సుంకం పై అభ్యంత‌రం తెల‌ప‌డానికి దిగుమ‌తిదారుల‌కు 180 రోజుల స‌మ‌యం ఉంటుందని.. ఆ స‌మ‌యం ముగిసిపోతే వారు యూఎస్ అధికారులు విధించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : IRAN- AMERICA : యుద్దం వ‌ల్ల అమెరికాకు అంత భారీ న‌ష్ట‌మా..?