IRAN- ISRAEL AMERICA WAR :యుద్దం ఆపేద్దాం.. ట్రంప్ న‌కు స‌హాయ‌కులు సూచ‌న

Donald Trump
Donald Trump

IRAN- ISRAEL AMERICA WAR : ఇరాన్-ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. యుద్దాన్ని ముగించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిట్ స్ట్రాల‌జీ పై దృష్టి సారించాల‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు సూచించిన‌ట్టు స‌మాచారం. పెరుగుతున్న చ‌మురు ధ‌ర‌లు, సుదీర్ఘ పోరాటం రాజ‌కీయంగా ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని స‌హాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ పేర్కొంది. ట్రంప్ సంప్ర‌దాయ మ‌ద్ద‌తుదారులు ఆప‌రేష‌న్ ఎపిక్ ప్యూరీని స‌మ‌ర్థిస్తున్న‌ప్ప‌టికీ యుద్ధం పొడ‌గించ‌బ‌డ‌టం వ‌ల్ల ఆ మ‌ద్ద‌తు అక్ర‌మంగా త‌గ్గుతుంద‌ని వ్యూహ క‌ర్త‌లు భావిస్తున్నారు.

LETS STOP WAR TRUMP’S AIDS SUGGEST IRAN ISRAEL AMERICA WAR

ఈ నేప‌థ్యంలోనే యుద్ధం పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప్ర‌తిబింబించే పోల్ రిపోర్టుల‌ను ట్రంప్ కి అందించారు. ఇటీవ‌లే జ‌రిగిన రాయిట‌ర్స్-ఇప్సోస్ స‌ర్వే ప్ర‌కారం.. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయిల్ దాడుల‌ను కేవ‌లం 29 శాతం మంది మాత్ర‌మే స‌మ‌ర్థిస్తున్నారు. దాదాపు 64 శాతం మంది ఓట‌ర్లు ఓ సైనిక జోక్యం వెనుక ఉన్న అస‌లు ల‌క్ష్యాల‌ను వివ‌రించ‌డంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ విఫ‌లం చెందాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ర‌స్తుతం 100 డాల‌ర్ల పైకి చేర‌డం రిప‌బ్లిక‌న్ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం పెడుతోంది. న‌వంబ‌ర్ లో జ‌రుగ‌నున్న మిడ్-ట‌ర్మ్ ఎన్నిక‌లపై ఇది తీవ్ర ప్ర‌భావం చూప‌తుంద‌ని కొంద‌రూ ఎంపీలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : Iran Israel War: యుద్ధం నీడలో దుబాయ్: కుదేలైన రియల్ ఎస్టేట్.. బిక్కుబిక్కుమంటున్న భారతీయులు!!

ట్రంప్ ఆర్థిక స‌ల‌హాదారు స్టీఫెన్ మూర్ మాట్లాడుతూ పెట్రోల్, చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ట్ట‌యితే ఇత‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరుగుతాయి. ఆర్థిక స్థోమ‌త ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఇది ప్ర‌భుత్వానికి స‌వాలుగా మారుతుంద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు వైట్ హౌస్ అధికార ప్ర‌తినిధి క‌రోలిన్ ఈవిట్ మాత్రం కొట్టి పారేశారు.

Also Read : ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..!