Cracked Heels: మడమలు పగులుతున్నాయా? ఇవి మీ శరీరంలోని లోపాల సూచనలు!!

మడమలు పగిలే సమస్యను చాలామంది సాధారణంగా తీసుకుంటారు, కానీ నిపుణులు దీని వెనుక నిజమైన కారణాల గురించి ముఖ్యమైన సమాచారం ఇస్తున్నారు. cracked heels లేదా పగిలిన మడమలు కేవలం అందం సమస్య కాకపోవచ్చు, ఇది మీ శరీరంలోని పోషకాహార లోపాల వైపు కూడా ఎత్తి చూపవచ్చు. డాక్టర్ జబాన్ మూర్ మాట్లాడుతూ, మీ పాదాలు బ్లడ్ సర్క్యులేషన్ చివర్లో ఉండడం వల్ల అక్కడ లోపాలు ముందుగా కనిపిస్తాయని చెప్పారు. జింక్ మరియు హెల్తీ ఫ్యాట్స్ తక్కువగా ఉంటే చర్మం సరిగ్గా మృదువుగా మారదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, డాక్టర్ హిమికా చావ్లా మాత్రం ఈ వాదనను కొంత సవాల్ చేశారు. పగిలిన మడమలు ఎప్పుడూ నేరుగా జింక్ లోపాన్ని సూచించవని, అలాంటి శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువని వారు చెప్పారు. నిజానికి, చాలా సార్లు రోజువారీ అలవాట్ల వలన ఈ సమస్య వస్తుంది. ఎక్కువసేపు నిలబడటం, బరువు ఎక్కువగా ఉండడం, చెప్పులు లేకుండా నడవడం, వృద్ధాప్యం, లేదా తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలే cracked heels కు సాధారణ కారణాలు. డయాబెటిస్, హైపోథైరాయిడిజం వంటి కండిషన్స్ ఉన్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ.

మీ పాదాలు చూసి నేరుగా పోషకాహార లోపాన్ని గుర్తించడం సాధ్యం కాదని డాక్టర్ చావ్లా వివరిస్తున్నారు. లోపాలు ఉంటే అది చర్మాన్ని ప్రభావితం చేసినా, ఇతర చర్మ రుగ్మతలతో కలిసిపోయి ఉంటాయి. ఖచ్చితమైన డయాగ్నోసిస్ కోసం పూర్తి మెడికల్ హిస్టరీ, డైట్ అసెస్మెంట్ అవసరమవుతుంది. అప్పుడే సీరం జింక్ వంటి టెస్టులు చేయాలని సూచించవచ్చు, కానీ అవి ఎప్పుడూ 100% ఖచ్చితమైనవి కాదు.

కొద్దివారాలు మాయిశ్చరైజర్ వాడినా cracked heels తగ్గకపోతే, లేదా నొప్పి ఎక్కువైతే డాక్టర్ ను సంప్రదించడం బెస్ట్. ఇన్ఫెక్షన్ సంకేతాలు ఉంటే లేదా డయాబెటిస్ ఉన్నవారు అయితే ముందుగానే వైద్య సహాయం తీసుకోవాలి. చిన్న పగులు కూడా తీవ్రమైన పాద సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకండి.

Share your love