Allu Arjun: ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా.. హింట్ ఇచ్చేసిన దర్శకుడు!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా బసిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఐకాన్’ అని రాసిన క్యాప్ ఫోటోను షేర్ చేయడంతో ఈ హింట్స్ ని నెటిజన్లు ఒక కన్నెత్తి చూస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా ఏ ప్రకటనా రాలేదు, కానీ ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.

Allu Arjun: Basil Joseph Insta Hint

బసిల్ జోసెఫ్ ముందుగా ‘మిన్నల్ మురళి’ లాంటి సూపర్‌హీరో movie తో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాడని news టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మధ్య అల్లు శిరీష్ పెళ్లిలో బసిల్ పాల్గొనడం కూడా ఈ speculations ని మరింత బలంగా చేసింది. కాకపోతే ‘శక్తిమాన్’ రీమేక్ గా ఉంటుందన్న ప్రచారాన్ని దర్శకుడు కొట్టిపారేశాడు, పూర్తిగా ఫ్రెష్ కథ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అల్లు ఫ్యామిలీ వారి ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నిర్మించే chance ఉందంటున్నారు. బన్నీ 25 వ సినిమాగా బసిల్ మూవీని ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా ఫిల్మ్ చేయనున్నాడు. వీటన్నిటి తర్వాతే బసిల్ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రాజెక్ట్ ఖరారు అయినట్లే అయినా, అధికారిక అనౌన్స్‌మెంటు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల కాంబినేషన్ బన్నీ కెరీర్‌ను మరింత హైపర్ అంచనాలకు తీసుకెళ్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఓ కొత్త దర్శకుడితో కలయిక మరో లెవెల్ ఎక్సైటింగ్ గా మారనుంది.

Share your love