Swimming: నెల రోజుల పాటు రోజూ ఈత కొడితే శరీరంలో జరిగే మార్పు ఇదే!!

ప్రస్తుతం 2026 లో ఈత కొట్టడం చాలామందికి ఫేవరెట్ వర్కౌట్ గా మారింది. నెల రోజుల పాటు రోజూ ఈత కొడితే శరీరానికి ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ వ్యాయామం తక్కువ ఇంపాక్ట్ తో మొత్తం శరీరాన్ని పని చేయించడంతో పాటు మైండ్ కి కూడా రిలాక్స్ ని ఇస్తుంది. అందుకే దీన్ని పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అని పిలుస్తారు. మీరు ఒక నెల పాటు కంటిన్యూగా నీళ్లల్లో స్విమ్మింగ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలి కదా? డాక్టర్ మంజుషా అగర్వాల్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గ్లెనెగల్స్ హాస్పిటల్, ముంబై, ఈ విషయంపై కొన్ని కీలక వివరాలు చెప్పారు.

Swimming మార్చేసే హెల్త్ సీక్రెట్స్

మొదటగా, కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. రోజూ ఈత కొట్టడం వల్ల గుండె మరింత ఎఫిషియంట్ గా పంప్ చేయడానికి ట్రైన్ అవుతుంది. డాక్టర్ అగర్వాల్ చెప్పినట్లుగా, ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగు పరిచి మొత్తం స్టామినా ని పెంచుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం తగ్గడం మొదలైన చిన్న మార్పులను మీరు నెలలోనే గమనించవచ్చు. ఇక ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. నియంత్రిత శ్వాస ట్రైనింగ్ వల్ల ఆక్సిజన్ ను మరింత సమర్ధవంతంగా యూజ్ చేసుకోవడానికి శరీరం నేర్చుకుంటుంది.

బరువు తగ్గడం మరియు కండరాలు టోన్ అవ్వడం కూడా ఒక మంచి ఫలితం. నీరు నేచురల్ గా రెసిస్టెన్స్ ను క్రియేట్ చేస్తుంది కాబట్టి, మీ శరీరం మొత్తం నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈత కొట్టడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి మరియు చేతులు, కాళ్లు, కోర్, వెన్ను వంటి అనేక మస్కిల్ గ్రూప్లు టోన్ అవుతాయి. నెల రోజుల తర్వాత మీ శరీరం మరింత బిగుతుగా, బలంగా మరియు బ్యాలెన్స్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. కీళ్ళపై ఒత్తిడి తగ్గడం వలన మోబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.

మానసిక ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం. స్విమ్మింగ్ చేసేటప్పుడు శ్వాస, స్ట్రోక్, గ్లైడ్ అనే లయ ధ్యానం లాగా ఫీల్ అవుతుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గడం మరియు ఎండార్ఫిన్లు విడుదలై మూడ్ మెరుగుపడుతుంది. డాక్టర్ అగర్వాల్ చెప్పినట్లుగా, ఇది ఆందోళనను తగ్గించి మెంటల్ వెల్ బీయింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అయితే, తగినంత రెస్ట్ లేకుండా ప్రతిరోజూ ఈత కొట్టడం వల్ల భుజాల ఒత్తిడి మరియు మస్కిల్ ఫ్యాటీగ్ లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి బ్యాలెన్స్ చాలా ముఖ్యం. లైట్ స్విమ్మింగ్ మరియు రెస్ట్ డేస్ ని తీవ్రమైన సెషన్స్ తో మిక్స్ చేయడం వలన బర్న్ అవుట్ ను అవాయిడ్ చేయవచ్చు. ఏదైనా కొత్త రొటీన్ స్టార్ట్ చేసే ముందు మీ హెల్త్ ప్రొవైడర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు.

Share your love