LDL కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!

LDL cholesterol చాలా కాలంగా ఎక్కువగా ఉంటే శరీరంలో ఏమవుతుందో తెలుసా? ఇటీవల UK సర్జన్ డాక్టర్ కరణ్ రాజన్ Instagramలో కొన్ని సైన్స్ బేస్డ్ అలవాట్లు షేర్ చేశారు. ఇవి LDL cholesterol ని సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్, బీన్స్ వంటి వాటి నుండి రోజుకు 5 నుండి 10 గ్రాముల soluble fiber తీసుకోవడం వల్ల LDL లో 5 నుండి 10 శాతం తగ్గుదల వస్తుందని ఆయన చెప్పారు. అలాగే, వెన్న బదులు ఆలివ్ ఆయిల్, nuts వాడటం వల్ల LDL 17 శాతం వరకు తగ్గుతుంది.

సోయా, tofu లాంటి plant proteins కూడా LDL ను తగ్గించడంలో ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవి completely cholesterol-free. డాక్టర్ రాజన్ ప్రకారం, ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ అయితే, body weight లో 5 నుండి 10 శాతం తగ్గించడం వల్ల LDL ఆరు శాతం వరకు తగ్గుతుంది. ఇది triglycerides మరియు HDL levels ని కూడా మెరుగుపరుస్తుంది. వారానికి 150 నిమిషాల aerobic exercise LDL ని 3 నుండి 6 శాతం తగ్గిస్తుంది. ఇవన్నీ కలిపి LDL ని 20 శాతం వరకు తగ్గించవచ్చు.

కార్డియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సిఎం నగేష్ మాట్లాడుతూ, అధిక LDL cholesterol ప్రమాదకరమని చెప్పారు. ఇది artery walls లో plaque ఏర్పడటానికి దారి తీస్తుంది, దీనిని atherosclerosis అంటారు. దీనివల్ల blood circulation తగ్గి, heart మరియు brain కి తక్కువ oxygen supply అవుతుంది. plaque rupture అయితే blood clot ఏర్పడి heart attack లేదా stroke కి కారణమవుతుంది. ఈ డ్యామేజ్ చాలా ఏళ్లు silent గా పురోగమించి, లక్షణాలు కనిపించేటప్పుడు చాలా లేట్ అవుతుంది.

ప్రాక్టికల్ గా, fried foods మరియు processed snacks ను nuts, seeds, fruits, high fiber meals తో replace చేయడం వల్ల lipid profile మెరుగవుతుంది. కాని lifestyle changes ఉన్నా కూడా cholesterol levels ఎక్కువగా ఉంటే, లేదా diabetes, hypertension, family history of heart disease వంటి అదనపు risk factors ఉంటే medication తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ నగేష్ చెప్పినట్లు, చికిత్స ఆలస్యం చేయడం వల్ల long-term cardiovascular risk పెరిగిపోతుంది. ఈ article public domain మరియు నిపుణుల సమాచారం ఆధారంగా రూపొందించబడింది, ఏదైనా దినచర్య ప్రారంభించే ముందు డాక్టర్ ను సంప్రదించండి.

Share your love