విజయ్ దేవరకొండ క్యూట్ ఫ్యామిలీ ఫోటో నెట్టింట హాట్ టాపిక్: అమ్మానాన్నల మధ్యలో రౌడీ హీరో

Vijay Sethupathi

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూనే ఉంటుంది. రీసెంట్‌గా ఆయన షేర్ చేసిన క్యూట్ ఫ్యామిలీ ఫోటో నెట్టింట హాట్ టాపిక్ అయింది. భారీ వర్షాల కారణంగా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ కావడంతో, విజయ్ తన పేరెంట్స్‌తో కలిసి ఇంట్లోనే రిలాక్స్ అయ్యారు.

Vijay Deverakonda Shares Cute Photos

షూటింగ్ బ్రేక్ దొరకడంతో విజయ్ తన అమ్మనాన్నల మధ్యలో పడుకుని సేదతీరారు. ఈ స్వీట్ మూమెంట్‌ను ‘రికవరీ – 1000%’ అంటూ ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, ఆ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఈ ఫోటో క్రెడిట్ మాత్రం తన భార్య రష్మిక మందన్నకి ఇవ్వడం విశేషం.

దీనిపై రష్మిక స్పందిస్తూ, “మిగతా ఫోటోలన్నింటికీ కూడా నాకు క్రెడిట్ ఇస్తావా?” అంటూ సరదాగా కామెంట్ చేశారు. అంతేకాదు, తన ‘పప్పీ ఐస్’ (puppy eyes) నుంచి తప్పించుకోవడానికే ఆయన అలా చేశాడంటూ ఆమె ఫన్నీగా టీజ్ చేశారు. ప్రస్తుతం ఈ క్యూట్ కన్వర్జేషన్ నెటిజన్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది.

మరోవైపు సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. ఏదీ తనను ఇప్పుడు స్ట్రాంగ్ చేయలేదని లేదా వీక్ చేయలేదని విజయ్ స్పష్టం చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ వాల్యూ గురించి మాట్లాడిన ఆయన, ఎవరి రూల్స్ లో వారు స్వతంత్రంగా ఎదగాలని నమ్ముతున్నారు.

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment