Vijay Deverakonda: ఆ హీరోయిన్ ఒప్పుకోకపోవడం వల్లే విజయ్ దేవరకొండ రష్మికతో ప్రేమలో పడ్డారా.?

Did Vijay Deverakonda fall in love with Rashmika because the heroine didnot agree

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నటువంటి కోరిక కార్యరూపం దాల్చింది.. హీరోయిన్ రష్మిక మందన్నతో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో చాలాసార్లు వచ్చింది. కానీ వీళ్లు స్నేహితులుగానే ఉంటున్నామని చెప్పుకుంటూ దాటవేస్తూ వచ్చారు. ఇకపోతే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూస్తూ వస్తున్నారు.

Did Vijay Deverakonda fall in love with Rashmika because the heroine didnot agree

వారి కోరికకు తగ్గట్టుగా రష్మిక మందాన విజయ్ దేవరకొండ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే తరుణంలో వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం చాలా సీక్రెట్ గా దగ్గర కుటుంబ సభ్యుల మధ్య చేసుకున్నరని సమాచారం అందుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..(Vijay Deverakonda)

Also Read: Hero: స్టార్ హీరో కూతురి న్యూ** ఫోటోలు.. అపరిచిత వ్యక్తి సంచలనం.!

ఇదే తరుణంలో రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ బంధం చిగురించడానికి ఒక హీరోయిన్ కారణమని ఒక వార్త బయటకు వచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరు వివరాలు చూద్దాం.. రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ కలిసి నటించిన చిత్రం గీతాగోవిందం. పరశురాం డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది. అంతేకాదు ఇందులో వీరి నటన చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది.

Did Vijay Deverakonda fall in love with Rashmika because the heroine didnot agree

అలాంటి ఈ చిత్రంలో ముందు హీరోయిన్ గా రష్మికను అనుకోలేదట. మెగా కోడలు లావణ్య త్రిపాఠిని తీసుకుందామనుకున్నారట. కానీ ఇందులో కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఆమె రిజెక్ట్ చేయడంతో రష్మిక మందానకు ఆఫర్ వెళ్లింది. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో చిత్రం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. చివరికి నిశ్చితార్థం కూడా పూర్తయిపోయింది. మరి వీరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.(Vijay Deverakonda)

Share your love