Vijay Deverakonda: ఆ హీరోయిన్ వల్ల విజయ్ దేవరకొండకు శని పట్టుకుంది.. అందుకే యాక్సిడెంట్.!

That heroine caused Vijay Deverakonda misfortune

Vijay Deverakonda: నిన్న అనగా సోమవారం రోజు విజయ్ దేవరకొండ కారుకి యాక్సిడెంట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు అదే కారులో విజయ్ దేవరకొండ, ఆయన ఫ్యామిలీ కూడా ఉంది.విజయ్ దేవరకొండకు చెందిన లెక్సెస్ మోడల్ కార్ ని బొలెరో వాహనం ఢీ కొట్టడంతో కార్ కి చిన్న డ్యామేజ్ జరిగింది. కానీ అందులో ఉన్న విజయ్ దేవరకొండకు ఆయన ఫ్యామిలీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

That heroine caused Vijay Deverakonda misfortune

వెంటనే ఆ కారును వదిలేసి మరో కారులో హైదరాబాద్ కు వెళ్లారు. అయితే పుట్టపర్తి లోని సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తున్నప్పుడు జోగులాంబ గద్వాల లోని ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ కారు యాక్సిడెంట్ కి సంబంధించి సోషల్ మీడియాలో సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. (Vijay Deverakonda)

Also Read: ‘హనుమాన్’, ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. అంచనాలు పెంచేశారే

విజయ్ దేవరకొండ కారు కి ప్రమాదం జరగడానికి కారణం రష్మికనే అని, రష్మికతో ఎంగేజ్మెంట్ అయిన వెంటనే విజయ్ కి ఈ ప్రమాదం జరిగిందంటూ,అది రష్మికకు ఉన్న శని అని, ఆమెకున్న శని విజయ్ కి చుట్టుకుందని, ఆమెతో ఎంగేజ్మెంట్ అపశకునం, ఆమె ఓ ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

That heroine caused Vijay Deverakonda misfortune

కానీ రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్టులను తిప్పి కొడుతున్నారు. రష్మిక అప శకునం, శని అనుకుంటే విజయ్ దేవరకొండకు ఏదైనా జరగాలి.కానీ ఆయనకు ఏమీ జరగకుండా యాక్సిడెంట్ నుండి ప్రాణాలతో బయటపడ్డారంటే దానంతటికి కారణం రష్మికనే.. ఆమె ఐరన్ లెగ్ కాదు అందుకే విజయ్ కి ఏమీ కాలేదు అంటూ రీ కౌంటర్లు ఇస్తున్నారు.(Vijay Deverakonda)

Share your love