తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నాడు న్యూఢిల్లీలో నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్‌ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీలో రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారుల మంజూరు అలాగే పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎన్హెచ్‌ఏఐ ప్రాజెక్టుల సభ్యులు విపనేష్ శర్మ కూడా పాల్గొన్నారు.
Komatireddy Venkat Reddy Meets Nhai
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65) విస్తరణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్‌ఏఐ అధికారులను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో విపరీతమైన రద్దీ పెరుగుతోందని తెలిపారు. దీనివల్ల తరచూ ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణనష్టం నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంత్రి అభ్యర్థనపై స్పందించిన ఎన్హెచ్‌ఏఐ అధికారులు హైదరాబాద్-విజయవాడ సెక్షన్ విస్తరణ పనులకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు టెండర్ల దాఖలుకు చివరి గడువుగా నవంబర్ 11, 2026 నిర్ణయించామని, 2027 జనవరి నాటికి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమవుతాయని ఎన్హెచ్‌ఏఐ చైర్మన్ తెలిపారు. ప్రస్తుతమున్న నాలుగు వరుసల రహదారిని ఇరువైపులా సర్వీస్ రోడ్లతో ఆరు వరుసలుగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: Chandrababu Naidu: AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు | Pawan Kalyan: ‘పవన్ చెప్పేది ఏంది బోడి..’ తెలుగు తమ్ముళ్ల సెటైర్లు | Indiramma Towers: తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్.. కేవలం రూ.4 లక్షలకే..
ఈ ప్రతిపాదిత విస్తరణ పూర్తికావడం వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తొలగిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు భద్రత మెరుగుపడి ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. కేవలం రవాణా సౌకర్యాల మెరుగుదలే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చి రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మరింత బలపర్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి





