
komatireddy venkat reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఓ మంత్రిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. లేడీ ఐఏఎస్ అధికారి అలాగే రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ఓ మంత్రికి సంబంధాలు ఉన్నట్లు ప్రముఖ చానల్స్ లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. దీనిపై ఐఏఎస్ ల సంఘం కూడా సీరియస్ అయింది. అయితే ఈ సంఘటన పైన తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఓ మంత్రికి అలాగే మహిళా అధికారికి మధ్య సంబంధాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు అలాగే ఒకటి రెండు టీవీ చానల్స్ లో ప్రత్యేక కథనాలు వచ్చినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. komatireddy venkat reddy
komatireddy venkat reddy reacts on ias lady officer
వీటిని తాను ఖండిస్తున్నట్లు కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి అయ్యాక నల్గొండలో నలుగురు కలెక్టర్లను మార్చేసినట్లు వివరించారు. వీరందరినీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చడని తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళా అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. komatireddy venkat reddy
Also Read: Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?
తన కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది అంటూ బాంబు పేల్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ తప్పుడు రాదల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. komatireddy venkat reddy
Also Read: Congress: బయటపడుతున్న మంత్రుల బండారం…మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా !





