JNTU-Hyderabad: సాంబార్‌లో నత్త.. మెస్ ఆహారంపై విద్యార్థుల ఆందోళన?

JNTU-Hyderabad: సాంబార్‌లో నత్త.. మెస్ ఆహారంపై విద్యార్థుల ఆందోళన?

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ మంజీర హాస్టల్‌లో ఆహార నాణ్యతపై తీవ్ర దుమారం రేగుతోంది. సోమవారం రాత్రి వడ్డించిన సాంబార్‌లో నత్త కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కొద్దిరోజుల క్రితమే చోలే మసాలా కూరలో బల్లి కనిపించిన ఘటన మరువకముందే, మళ్లీ ఇలాంటి అపరిశుభ్రత వెలుగుచూడటం హాస్టల్ విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది.

JNTU Hyderabad Hostel Food Safety

ఉత్తర భారతదేశానికి చెందిన ఒక విద్యార్థి భోజనం చేస్తున్న సమయంలో సాంబార్ గిన్నెలో నత్తను గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మెస్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు మొదట అది నత్త కాదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధితుడు గట్టిగా నిలదీయడంతో సిబ్బంది ఆ సాంబార్‌ను పారబోశారని, అప్పటికే కొందరు విద్యార్థులు ఆ ఆహారాన్ని భుజించారని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న హాస్టల్ విద్యార్థులు పెద్ద ఎత్తున మెస్ వద్ద నిరసనకు దిగారు. యూనివర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది రోజుల క్రితం జరిగిన బల్లి ఘటనపై ఫిర్యాదు చేసినా, అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

హాస్టల్ మెస్‌లలో పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం లేదని, వంట గదుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని ఏ విధంగా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తల కోసం..


Visited 1 times, 1 visit(s) today

Leave a Comment