Vijay: విజయ్ వాహనాలన్నింటికీ అదే నెంబర్..చెల్లి కోసమేనా.?

All of Vijay vehicles have the same number

Vijay: దళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించినటువంటి హీరో రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. ఈయన తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు రాబోవు ఎలక్షన్స్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లో జోష్ పెంచుతున్నారు. అలాంటి విజయ్ తాజాగా ఒక ప్రత్యేకమైన బస్సును కొనుగోలు చేశారు.

All of Vijay vehicles have the same number

అయితే ఈ బస్సుకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..నిజానికి ఆయన ఏ వాహనం తీసుకున్నా తప్పనిసరిగా సెంటిమెంట్ పాటిస్తారట..దాని ప్రకారమే తాను తీసుకున్న వాహనాలన్నింటికీ నెంబర్ తీసుకుంటారట.. విజయ్ ఎలాంటి వాహనం కొనుగోలు చేసినా నెంబర్ మాత్రం అస్సలు మారదు. ఆ నెంబర్ కోసం వాహనం కంటే ఎక్కువ డబ్బులు పెట్టైనా తీసుకుంటారట. ఇంతకీ ఆ సెంటిమెంట్ నెంబర్ ఏంటయ్యా అంటే 0277 మరి దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..(Vijay)

Also Read: Jagapathi Babu: నన్ను పెళ్లి చేసుకో నీకు ఎదురు కట్నం ఇస్తా.. జగపతి బాబుకి హీరోయిన్ ఆఫర్.!

సాధారణంగా తమిళనాడులో టీఎన్ 14 అనేది ప్రతి వాహనానికి వస్తుంది. దాని తర్వాత వచ్చే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అతని ప్రచార వాహనం నెంబర్ ప్లేట్ కూడా TN14AS0277 ఉండడం విశేషం. అతని వాహనాలపై 14-02-77 ఒక తేదీని చూపిస్తుందట. ఈ డేట్ వెనుక అసలు సెంటిమెంటు ఏంటంటే తన చెల్లెలు మరణం.. అయితే విజయ్ చెల్లెలు విద్య 14-02-1977న జన్మించింది.

All of Vijay vehicles have the same number

కానీ ఆమె అనారోగ్యం కారణంగా 1984లో కన్ను మూసింది. చెల్లి మరణంతో ఎంతో కృంగిపోయిన విజయ్ ఆమెను మర్చిపోలేక పోయారు. చివరికి తన కూతురికి కూడా తన చెల్లెలు విద్య పేరును పోలి ఉండేలా దివ్య అని పేరు పెట్టారు. ఆమె మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లినటువంటి విజయ్ తన చెల్లెలు డేట్ ఆఫ్ బర్త్ కలిసి వచ్చేలా తన వాహనాలన్నింటికీ 0277 అనే సిరీస్ లో నెంబర్ ప్లేట్లను తీసుకుంటూ వస్తున్నారు.(Vijay)

Share your love