అనుష్క లీడ్ రోల్స్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసింది. ఇప్పుడామె చేస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ఘాటి. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అనుష్క మొత్తం తగలబెట్టేసింది. మాస్ యాక్షన్ రోల్ లో ఆమె పీక్స్ పర్ ఫార్మెన్స్ చూపించింది. బ్రిటిష్ కాలంలో ప్రమాదకరమైన కొండప్రాంతాల్లో రోడ్లు నిర్మించిన ఘాటి తెగ..కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయింది. తప్పు చేస్తున్నామనే గ్రహించి, ఈ చెడు వ్యవస్థకి ఎదురు నిలవడానికి సిద్ధమవుతుంది అనుష్క.
ఒక సాధారణ మహిళ ఎదురుతిరిగి నేరస్తురాలు ఎలా అయ్యింది, తన వాళ్లకు దేవత ఎలా అయ్యింది అనేది ఘాటి కథ. సీతమ్మోరు చేసే లంకా దహనం చూస్తారు అనే డైలాగ్ ఘాటి ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తోంది. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. ఎమోషన్, యాక్షన్, లవ్ వంటి అన్ని అంశాలతో క్రిష్ కసిగా ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.





