అవికా గోర్ సీరియల్స్‌కు రీ-ఎంట్రీ? చిన్నప్పుడు ఎదురైన సవాళ్ళు!!

మ‌ళ్లీ సీరియ‌ల్స్‌లోకి అవికా?

బాలనటిగా టీవీ సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన అవికా గోర్ ప్రస్తుతం మళ్ళీ తన పాత బాటలోకి రావడానికి సిద్ధమవుతున్నారా? వెండితెరపై మంచి పేరు తెచ్చుకున్న ఈ నటి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి రోజుల అనుభవాలు షేర్ చేశారు. చిన్నప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అవికా తన కెరీర్‌లో ఎదురైన కష్టాలు, మానసిక పోరాటాల గురించి బోల్డ్ గా చెప్పుకొచ్చారు.

Avika Gor Early Struggles

తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నానని అవికా చెప్పారు. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ అనుభవాలు మనల్ని మెచ్యూర్ చేస్తాయి అని ఇంటర్వ్యూలో అన్నారు. ఇతరుల కామెంట్స్‌ను ఎక్కువగా పట్టించుకోవడం వల్ల డిప్రెషన్ లాంటి పరిస్థితులు వచ్చాయని, కానీ తర్వాత తను బలపడ్డానని తెలిపారు. ఎవరి లైఫ్ వారిది అనే మైండ్‌సెట్ వచ్చాకే చాలా మార్పు వచ్చింది అని చెప్పారు.

ప్రస్తుతం అవికా ‘వసంత కోకిల’ మూవీతో బిజీగా ఉన్నారు. విభిన్నమైన రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయడానికి తను ఇష్టపడతానని అంటున్నారు. ఈ నటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె అభిమానులు ఆమె జర్నీని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సీరియల్స్ లోకి రావడం గురించి కూడా ఆమె సూచించినట్లు తెలుస్తోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu